వార్త ముఖ్యాంశాలు
- యలమంచిలి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండడంతో రైతులు సాగు పనులను వేగవంతం చేశారు.
- పులపర్తి గ్రామంలో మల్లపరెడ్డి గోవింద్ పొలంలో వరి నాట్లు వేసే విధానాన్ని మండల వ్యవసాయ అధికారి మోహన్రావు పరిశీలించారు.
- సుమారు 65 రోజుల ముదిరిన నారును నాటే సమయంలో మొక్కలను దగ్గరగా నాటుకోవాలని సూచించారు.
యలమంచిలి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండడంతో రైతులు సాగు పనులను వేగవంతం చేశారు. పులపర్తి గ్రామంలో మల్లపరెడ్డి గోవింద్ పొలంలో వరి నాట్లు వేసే విధానాన్ని మండల వ్యవసాయ అధికారి మోహన్రావు పరిశీలించారు. సుమారు 65 రోజుల ముదిరిన నారును నాటే సమయంలో మొక్కలను దగ్గరగా నాటుకోవాలని సూచించారు. ఎకరాకు అదనంగా 25 కిలోల యూరియా వినియోగించాలని తెలిపారు. దోమ, పొడ తెగుళ్ల నివారణకు ఎసిఫేట్, హెక్సాకొనజోల్ మందులను ప్రాథమిక దశలోనే పిచికారీ చేయాలన్నారు. పంట వేయని భూముల్లో రాగులు, జనుము, ఉలవల విత్తనాలను 80 శాతం రాయితీపై రైతు సేవా కేంద్రాల్లో అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకురాలు హేమ, ఏపీ సీ.ఎన్.ఎఫ్ సిబ్బంది వనజ, నాయుడు పాల్గొన్నారు.