Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • పల్లె పండుగ 3.0' కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు.
  • బుధవారం యలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
  • ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

పల్లె పండుగ 3.0′ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం యలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మండలంలోని 11 గ్రామ పంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి గానూ మొత్తం 40 అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. వీటి నిర్మాణానికి రూ. 3.82 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించినట్లు వెల్లడించారు. ​గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. పల్లెల్లో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా సమకూరుస్తూ, గ్రామాల సర్వాంగీణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు మరియు కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *