Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అన్నదేవరపేట శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడిఐదుగురు అరెస్ట్.. రూ.16,100 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నదేవరపేట శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడిఐదుగురు అరెస్ట్.. రూ.16,100 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం

వార్త ముఖ్యాంశాలు

  • తాళ్లపూడి పున్నమి ప్రతినిధి జూన్ 24: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై తాళ్లపూడి పోలీసులు సోమవారం సాయంత్రం మెరుపు దాడి నిర్వహించి ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు.
  • ఈ సందర్భంగా రూ.16,100 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తాళ్లపూడి ఎస్‌ఐ టి.
  • రామకృష్ణ తెలిపారు.

తాళ్లపూడి పున్నమి ప్రతినిధి
జూన్ 24:
తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై తాళ్లపూడి పోలీసులు సోమవారం సాయంత్రం మెరుపు దాడి నిర్వహించి ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రూ.16,100 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తాళ్లపూడి ఎస్‌ఐ టి. రామకృష్ణ తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ టి. రామకృష్ణ తన సిబ్బంది ముదయ్య, సురేష్, ఫణికుమార్, శ్రీనివాస్‌లతో కలిసి అన్నదేవరపేట గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశంలో “కోత-బంతి” జూదం ఆడుతున్న వారిపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మొత్తం రూ.16,100 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ చేసిన నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ టి. రామకృష్ణ వెల్లడించారు. చట్టవిరుద్ధంగా జూదం నిర్వహించే వారిపై పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *