Monday, 22 June 2026
  • Home  
  • కలిగిరిలో నూతన పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరిలో నూతన పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల..

🔸ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలందించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీసు సర్కిల్ కార్యాలయ భవనాన్ని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ భవనాన్ని పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు త్వరితగతిన పోలీసు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ, ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ నూతన సర్కిల్ కార్యాలయం ద్వారా కలిగిరి సర్కిల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి.వి. రమణ, సీఐ సుబ్బారావు, కలిగిరి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

🔸ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలందించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు.

కలిగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీసు సర్కిల్ కార్యాలయ భవనాన్ని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ భవనాన్ని పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలను తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన మరియు త్వరితగతిన పోలీసు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ, ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు.

ఆధునిక వసతులతో నిర్మించిన ఈ నూతన సర్కిల్ కార్యాలయం ద్వారా కలిగిరి సర్కిల్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి.వి. రమణ, సీఐ సుబ్బారావు, కలిగిరి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.