: తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు నాగోలు రమణా రెడ్డి ఆకస్మిక మరణం పార్టీకి, ప్రాంతానికి తీరని లోటని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దకన్నలిలో నిర్వహించిన రమణా రెడ్డి కర్మక్రియల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ పరంగా, వ్యక్తిగతంగా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రమణా రెడ్డి సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

టిడిపి సీనియర్ నాయకుడి మృతికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సంతాపం