Thursday, 18 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, చైర్మన్ జగన్నాథ నాయుడు, సెక్రటరీ బాలాజీ ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. బిజెపి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోలా ఆనంద్, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి, మునిరాజానాయుడు కూడా ఈ పోటీల నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పురుషుల, స్త్రీల జట్లతో పాటు ఇండియన్ రైల్వేస్ జట్లు కూడా పాల్గొంటాయి. మొత్తం 750 మంది క్రీడాకారులు, 250 మంది అధికారులు కలిపి సుమారు 1,000 మంది ఈ పోటీలకు హాజరవుతారని ప్రెసిడెంట్ వెంకటస్వామి తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి, పోటీలు జరిగే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.