Wednesday, 5 August 2026
  • Home  
  • *ఒత్తిడి కోరల్లో సచివాలయ ఉద్యోగులు*
- ఆంధ్రప్రదేశ్

*ఒత్తిడి కోరల్లో సచివాలయ ఉద్యోగులు*

*గుంటూరు* : ఒత్తిడి కోరల్లో సచివాలయ ఉద్యోగులు గుంటూరులో అడ్మిన్ సెక్రటరీకి బ్రెయిన్ స్ట్రోక్! పనుల భారంతో కుప్పకూలుతున్న సిబ్బంది.. రాత్రి 10 గంటల వరకు ఉన్నతాధికారుల వేధింపులు.. జి.ఎం.సి.లో వింత తీరుపై ఆగ్రహం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సచివాలయ వ్యవస్థ, ఇప్పుడు అధికారుల మితిమీరిన ఒత్తిడితో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గమనించకుండా, కేవలం టార్గెట్ల వేటలో ఉన్నతాధికారులు వేధిస్తుండటంతో సిబ్బంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనికి నిదర్శనమే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 162వ వార్డు సచివాలయంలో చోటుచేసుకున్న విషాద ఘటన. వరుస సర్వేల సెగ.. ప్రాణం మీదకు! 162వ వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్న నాగూర్ గత కొంతకాలంగా విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కేవలం సాధారణ సచివాలయ పనులే కాకుండా.. SIR (Special Intensive Revision), BLO (Booth Level Officer) విధులు యోగాంద్ర, eKYC, UFS (Unified Foundation Survey) అక్షరాంధ్ర, తల్లికి వందనము వంటి అనేక రకాల సర్వేలు ఆయనపై అదనపు భారాన్ని మోపాయి. వీటికి తోడు ‘స్వర్ణ వార్డు’, ‘స్వర్ణ సచివాలయం’ పేరుతో వస్తున్న కొత్త నిబంధనలు సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక నాగూర్ గారు అకస్మాత్తుగా పక్షవాతం (Paralysis Stroke) బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సూపర్‌వైజర్లు ఎక్కువ.. పనిచేసే వారు తక్కువ! జి.ఎం.సి. (GMC) కార్యాలయంలో వింత పరిస్థితి నెలకొంది. పనులు చేసే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంటే, వారిని పర్యవేక్షించే (Supervisors) అధికారుల సంఖ్య మాత్రం అధికంగా ఉంది. ఉన్న కొద్దిమంది సిబ్బందిని కూడా వేరే విభాగాలకు డెప్యూటేషన్ (Deputation) పై పంపించడంతో, మిగిలిన వారిపై పని భారం రెట్టింపు అవుతోంది. తక్కువ మందితో ఇన్ని రకాల సర్వేలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు ‘క్లాసుల’ పర్వం! ఒకవైపు సర్వేలు తక్కువగా ఉన్నాయని సాకులు చెబుతూ, మరోవైపు సచివాలయ సిబ్బందిని రాత్రి 7 గంటల సమయంలో కార్పొరేషన్ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. అక్కడ రాత్రి 10గంటల వరకు ఉంచి, అసభ్య పదజాలంతో తిట్టడం నిత్యకృత్యంగా మారింది. జి.ఎం.సి.లోని ఒక ఉన్నతాధికారి తీరు వల్లే ఈ వేధింపులు పెరిగిపోయాయని, ఉద్యోగుల కనీస వ్యక్తిగత జీవితం కూడా నాశనమవుతోందని సిబ్బంది వాపోతున్నారు. డిమాండ్: పని ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైన నాగూర్ గారికి ప్రభుత్వం అండగా నిలవాలని, సచివాలయ సిబ్బందిపై ఉన్న ఈ అమానవీయ ఒత్తిడిని వెంటనే తగ్గించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డెప్యూటేషన్లను రద్దు చేసి సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు….

*గుంటూరు* :

ఒత్తిడి కోరల్లో సచివాలయ ఉద్యోగులు

గుంటూరులో అడ్మిన్ సెక్రటరీకి బ్రెయిన్ స్ట్రోక్!
పనుల భారంతో కుప్పకూలుతున్న సిబ్బంది..
రాత్రి 10 గంటల వరకు ఉన్నతాధికారుల వేధింపులు..

జి.ఎం.సి.లో వింత తీరుపై ఆగ్రహం..

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సచివాలయ వ్యవస్థ, ఇప్పుడు అధికారుల మితిమీరిన ఒత్తిడితో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గమనించకుండా, కేవలం టార్గెట్ల వేటలో ఉన్నతాధికారులు వేధిస్తుండటంతో సిబ్బంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనికి నిదర్శనమే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 162వ వార్డు సచివాలయంలో చోటుచేసుకున్న విషాద ఘటన.

వరుస సర్వేల సెగ.. ప్రాణం మీదకు!
162వ వార్డు అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్న నాగూర్ గత కొంతకాలంగా విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కేవలం సాధారణ సచివాలయ పనులే కాకుండా..
SIR (Special Intensive Revision), BLO (Booth Level Officer) విధులు
యోగాంద్ర, eKYC, UFS (Unified Foundation Survey)
అక్షరాంధ్ర, తల్లికి వందనము
వంటి అనేక రకాల సర్వేలు ఆయనపై అదనపు భారాన్ని మోపాయి. వీటికి తోడు ‘స్వర్ణ వార్డు’, ‘స్వర్ణ సచివాలయం’ పేరుతో వస్తున్న కొత్త నిబంధనలు సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక నాగూర్ గారు అకస్మాత్తుగా పక్షవాతం (Paralysis Stroke) బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సూపర్‌వైజర్లు ఎక్కువ.. పనిచేసే వారు తక్కువ!

జి.ఎం.సి. (GMC) కార్యాలయంలో వింత పరిస్థితి నెలకొంది. పనులు చేసే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంటే, వారిని పర్యవేక్షించే (Supervisors) అధికారుల సంఖ్య మాత్రం అధికంగా ఉంది. ఉన్న కొద్దిమంది సిబ్బందిని కూడా వేరే విభాగాలకు డెప్యూటేషన్ (Deputation) పై పంపించడంతో, మిగిలిన వారిపై పని భారం రెట్టింపు అవుతోంది. తక్కువ మందితో ఇన్ని రకాల సర్వేలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే, అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి 10 గంటల వరకు ‘క్లాసుల’ పర్వం!

ఒకవైపు సర్వేలు తక్కువగా ఉన్నాయని సాకులు చెబుతూ, మరోవైపు సచివాలయ సిబ్బందిని రాత్రి 7 గంటల సమయంలో కార్పొరేషన్ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. అక్కడ రాత్రి 10గంటల వరకు ఉంచి, అసభ్య పదజాలంతో తిట్టడం నిత్యకృత్యంగా మారింది. జి.ఎం.సి.లోని ఒక ఉన్నతాధికారి తీరు వల్లే ఈ వేధింపులు పెరిగిపోయాయని, ఉద్యోగుల కనీస వ్యక్తిగత జీవితం కూడా నాశనమవుతోందని సిబ్బంది వాపోతున్నారు.

డిమాండ్:

పని ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైన నాగూర్ గారికి ప్రభుత్వం అండగా నిలవాలని, సచివాలయ సిబ్బందిపై ఉన్న ఈ అమానవీయ ఒత్తిడిని వెంటనే తగ్గించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డెప్యూటేషన్లను రద్దు చేసి సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.