పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: ఖమ్మం జిల్లా రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో రజక సామాజికవర్గానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత హేయమైనదని కోడేరు మండలం నాగులపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ మరియు BJHPS రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడు గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సమాజంలో రోజురోజుకూ మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవడం ఆందోళనకరమని అన్నారు. నిరుపేద రజక కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై గౌస్ పాషా అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించడం నరరూప రాక్షసత్వమేనని మండిపడ్డారు. ఇటువంటి కామాంధులకు సమాజంలో తిరిగే అర్హత లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి:బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ₹50 లక్షల ఎక్స్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లా స్థలం కేటాయించి ఆదుకోవాలి. నిందితుడి వెనుక ఎంతటి వారు ఉన్నా వదలకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడు గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి. దూపం అంజనేయులు నాగులపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ మరియు BJHPS రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు