Friday, 12 June 2026
  • Home  
  • *_రిజర్వేషన్లపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్.._*
- జాతీయ అంతర్జాతీయ

*_రిజర్వేషన్లపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్.._*

*_రిజర్వేషన్లపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్.._* _న్యూఢిల్లీ, జూన్12: మతం మారిన దళితులకు రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్.._ _తన నివేదికను సిద్ధం చేసింది. దళిత క్రైస్తవ, ముస్లింల ఎస్సీ హోదాతోపాటు మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పనపై జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను పూర్తి చేసింది. త్వరలో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ అందజేయనుంది. ఈ అంశాలపై దాదాపు నాలుగేళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేసి ఈ నివేదికకు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ రూపొందించింది._ _జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. క్రైస్తవ, ఇస్లాం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ఈ కమిషన్ అధ్యయనం చేసింది. ప్రస్తుతం పుస్తక రూపంలో ఈ కమిషన్ నివేదిక ముద్రణలో ఉంది. మరి కొద్ది రోజుల్లో కేంద్రానికి ఈ నివేదికను కమిషన్_ _అందజేయనుంది. జూన్ 10వ తేదీతో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ గడువు ముగిసింది. అయితే మరో10 రోజులపాటు ఈ కమిషన్ గడువును కేంద్రం పొడిగించింది._ _మతం మారిన తర్వాత కూడా దళితులు సామాజిక వివక్షను ఎదుర్కుంటున్నారా? అనే అంశంపై ప్రజల్లోకి వెళ్లి ఈ కమిషన్ ఆరా తీసింది. 1950 నాటి రాజ్యాంగం ఉత్తర్వు ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఇస్తున్నారు. ముస్లిం, క్రైస్తవ మతాల్లోని దళితులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని చాలా కాలంగా దళిత సంఘాల డిమాండ్ చేస్తున్నాయి._ _ఇస్లాం, క్రైస్తవ మతాల్లో కుల వ్యవస్థ లేదంటూ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇస్లాం, క్రైస్తవ మతాల్లో చేరిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే. ఈ కమిషన్ సిఫార్సులపై దేశవ్యాప్తంగా అటు రాజకీయాల్లోనూ, ఇటు సామాజిక వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది._

*_రిజర్వేషన్లపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్.._*

_న్యూఢిల్లీ, జూన్12: మతం మారిన దళితులకు రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్.._

_తన నివేదికను సిద్ధం చేసింది. దళిత క్రైస్తవ, ముస్లింల ఎస్సీ హోదాతోపాటు మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పనపై జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను పూర్తి చేసింది. త్వరలో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ అందజేయనుంది. ఈ అంశాలపై దాదాపు నాలుగేళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేసి ఈ నివేదికకు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ రూపొందించింది._

_జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. క్రైస్తవ, ఇస్లాం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ఈ కమిషన్ అధ్యయనం చేసింది. ప్రస్తుతం పుస్తక రూపంలో ఈ కమిషన్ నివేదిక ముద్రణలో ఉంది. మరి కొద్ది రోజుల్లో కేంద్రానికి ఈ నివేదికను కమిషన్_ _అందజేయనుంది. జూన్ 10వ తేదీతో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ గడువు ముగిసింది. అయితే మరో10 రోజులపాటు ఈ కమిషన్ గడువును కేంద్రం పొడిగించింది._

_మతం మారిన తర్వాత కూడా దళితులు సామాజిక వివక్షను ఎదుర్కుంటున్నారా? అనే అంశంపై ప్రజల్లోకి వెళ్లి ఈ కమిషన్ ఆరా తీసింది. 1950 నాటి రాజ్యాంగం ఉత్తర్వు ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఇస్తున్నారు. ముస్లిం, క్రైస్తవ మతాల్లోని దళితులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని చాలా కాలంగా దళిత సంఘాల డిమాండ్ చేస్తున్నాయి._

_ఇస్లాం, క్రైస్తవ మతాల్లో కుల వ్యవస్థ లేదంటూ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇస్లాం, క్రైస్తవ మతాల్లో చేరిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే. ఈ కమిషన్ సిఫార్సులపై దేశవ్యాప్తంగా అటు రాజకీయాల్లోనూ, ఇటు సామాజిక వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది._

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.