గూడూరు జూన్ 12
ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ కె. రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రిన్సిపాల్ గా తన విధులు ప్రారంభించారు. గతంలో కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్ర అధ్యాపకుడిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేసి పదోన్నతి పొంది కమిషనర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు ప్రస్తుత ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శివప్రసాద్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్ కు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థిని విద్యార్థులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. రాంప్రసాద్ మాట్లాడుతూ కళాశాల పూర్వ వైభవానికి అన్ని విధాలుగా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.



