*ఈ నెల 14 నుంచి 16 వరకు సింగపూర్ పర్యటనకు సీఎం*
*ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14 నుంచి 16 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ మరియు ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్లనుంది. సింగపూర్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి, అత్యాధునిక పట్టణ ప్రణాళికల రూపకల్పనతో పాటు ఆంధ్రప్రదేశకు పెద్ద ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనలో కీలక చర్చలు జరపనున్నారు*


