ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రించాలి.


అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి.
ప్రైవేట్ పాఠశాలలో స్టేషనరీ బుక్స్ విక్రయించారదు.
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కల్వకుర్తి శాఖ ఆధ్వర్యంలో MEO శంకర్ నాయక్ గారిని కలిసి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగింది. పాఠశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, ఫీజుల భారం, ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా ABVP కల్వకుర్తి నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్ మాట్లాడుతూ ” ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, ఫర్నిచర్ మరియు ఇతర విద్యా సౌకర్యాల లోపంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు మరియు ఇతర విద్యా సామగ్రి అందేలా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని పేర్కొన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.విద్యార్థుల హక్కుల కోసం ABVP ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని తెలిపారు.” ఈ కార్యక్రమంలో ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ ప్రశాంత్ యాదవ్,కార్యకర్తలు,శివరాం,చరణ్,భరద్వాజ్,నర్సింహా,ప్రణీత్,సిద్ధార్థ,శ్రీశైలంహేమంత్ ,కృష్ణ. తదితరులు పాల్గొన్నారు

