Tuesday, 4 August 2026
  • Home  
  • ఓసూరమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు, పొంగళ్ళు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఓసూరమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు, పొంగళ్ళు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 9 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం గురువిందపూడి గ్రామదేవత శ్రీ ఓసూరమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు భక్తిశ్రద్ధలతో బోనాలు, పొంగళ్ళు నిర్వహించారు. స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ‘ఓసూరమ్మ తల్లికి జై’ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం నిర్వహించిన గ్రామోత్సవంలో యువకుల వీరతాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 9 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం గురువిందపూడి గ్రామదేవత శ్రీ ఓసూరమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు భక్తిశ్రద్ధలతో బోనాలు, పొంగళ్ళు నిర్వహించారు. స్థానికులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ‘ఓసూరమ్మ తల్లికి జై’ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం నిర్వహించిన గ్రామోత్సవంలో యువకుల వీరతాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.