Saturday, 6 June 2026
  • Home  
  • చిట్వేల్ మండలానికి నూతన తహసీల్దార్‌గా శ్రీ ఎస్.వి. నరసింహారావు బాధ్యతల స్వీకరణ
- అన్నమయ్య

చిట్వేల్ మండలానికి నూతన తహసీల్దార్‌గా శ్రీ ఎస్.వి. నరసింహారావు బాధ్యతల స్వీకరణ

తిరుపతి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ వారి ఉత్తర్వుల మేరకు, ఇప్పటివరకు కలెక్టరేట్, తిరుపతి సి-సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్.వి. నరసింహారావు గారు, చిట్వేల్ మండల తహసీల్దార్‌గా బదిలీపై నియమితులై నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు రెవెన్యూ సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తామని, భూ సంబంధిత సమస్యలు, పౌర సేవలకు సంబంధించిన దరఖాస్తులను నిర్దేశిత గడువులో పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది నూతన తహసీల్దార్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ వారి ఉత్తర్వుల మేరకు, ఇప్పటివరకు కలెక్టరేట్, తిరుపతి సి-సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్.వి. నరసింహారావు గారు, చిట్వేల్ మండల తహసీల్దార్‌గా బదిలీపై నియమితులై నేడు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు రెవెన్యూ సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తామని, భూ సంబంధిత సమస్యలు, పౌర సేవలకు సంబంధించిన దరఖాస్తులను నిర్దేశిత గడువులో పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది నూతన తహసీల్దార్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.