Saturday, 6 June 2026
  • Home  
  • శ్రీకాళహస్తి కోర్టులో న్యాయమూర్తుల నియామకం, ఏర్పాటుకు జిల్లా జడ్జికి వినతి
- తిరుపతి

శ్రీకాళహస్తి కోర్టులో న్యాయమూర్తుల నియామకం, ఏర్పాటుకు జిల్లా జడ్జికి వినతి

శ్రీకాళహస్తి, జూన్ 06, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి కోర్టులో ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శనివారం చిత్తూరులో జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. కోర్టులో ప్రస్తుతం తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కేసుల పెండింగ్ పెరుగుతోందని, వెంటనే ఖాళీలను భర్తీ చేసి న్యాయ సేవలను వేగవంతం చేయాలని కోరారు. అదేవిధంగా, కోర్టు భవనంలో లిఫ్ట్ సౌకర్యం లేకపోవడంతో వృద్ధులు, కక్షిదారులు, న్యాయవాదులు రెండు అంతస్తులు ఎక్కి దిగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే లిఫ్ట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు బార్ అసోసియేషన్‌కు ప్రత్యేక భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలపై స్పందించిన జిల్లా జడ్జి సానుకూలంగా స్పందించి, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరంభాకం మునిప్రసాద్, ఉపాధ్యక్షుడు కాకి చిన్న అంకయ్య, కార్యదర్శి తులసీరామ్, సీనియర్ న్యాయవాదులు కన్నలి ప్రభాకర్ రెడ్డి, కె. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.