Saturday, 6 June 2026
  • Home  
  • APAIMS యాప్‌లో నమోదు చేసుకోవాలి: వ్యవసాయ శాఖ
- తూర్పు గోదావరి

APAIMS యాప్‌లో నమోదు చేసుకోవాలి: వ్యవసాయ శాఖ

రైతులకు ఎరువుల కొరత లేదు.. APAIMS ద్వారా సులభ సేవలు తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి: రైతులు APAIMS యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు తమ ఆధార్ నంబర్‌తో APAIMS యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, తాము సాగు చేస్తున్న పంటల వివరాలు, స్వీయ పంట నమోదు, ప్రభుత్వ పథకాల సమాచారం, చీడపీడల నివారణకు సంబంధించిన సలహాలు, వాతావరణ సమాచారం, పంటల కనీస మద్దతు ధర (MSP) వివరాలు తదితర అంశాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారు సాగు చేసే పంటలు మరియు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులను రెండు నుంచి మూడు దఫాలుగా APAIMS పోర్టల్ ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి రైతుకు పారదర్శకంగా ఎరువులు అందేలా చూడటంతో పాటు, వ్యవసాయేతర అవసరాల కోసం యూరియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కూడా వీలు కలుగుతుందని వివరించారు. రైతులు ఎరువుల కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తుగా కొనుగోలు చేసేందుకు ఎరువుల దుకాణాల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పనిలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. APAIMS యాప్ వినియోగంపై రైతు సేవా కేంద్రం (RSK) సిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.

రైతులకు ఎరువుల కొరత లేదు.. APAIMS ద్వారా సులభ సేవలు
తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి: రైతులు APAIMS యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు తమ ఆధార్ నంబర్‌తో APAIMS యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, తాము సాగు చేస్తున్న పంటల వివరాలు, స్వీయ పంట నమోదు, ప్రభుత్వ పథకాల సమాచారం, చీడపీడల నివారణకు సంబంధించిన సలహాలు, వాతావరణ సమాచారం, పంటల కనీస మద్దతు ధర (MSP) వివరాలు తదితర అంశాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రాబోయే ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారు సాగు చేసే పంటలు మరియు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులను రెండు నుంచి మూడు దఫాలుగా APAIMS పోర్టల్ ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి రైతుకు పారదర్శకంగా ఎరువులు అందేలా చూడటంతో పాటు, వ్యవసాయేతర అవసరాల కోసం యూరియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కూడా వీలు కలుగుతుందని వివరించారు.
రైతులు ఎరువుల కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తుగా కొనుగోలు చేసేందుకు ఎరువుల దుకాణాల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పనిలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.
APAIMS యాప్ వినియోగంపై రైతు సేవా కేంద్రం (RSK) సిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.