విశాఖపట్నం గాజువాక శాఖ గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు, బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, టి. శ్రీరామ్మూర్తి, బలిరెడ్డి సత్యనారాయణ, అజయ్ కుమార్, పి.వి. రమణ పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. పుస్తక పఠనం అలవాటు మేధాశక్తిని పెంపొందిస్తుందని చైర్మన్ సూచించారు. కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి బి. సూర్యకళ నిర్వహించగా, విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు.

వేసవి శిబిరం ముగింపు వేడుక ఘనం