Friday, 5 June 2026
  • Home  
  • పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం
- E-పేపర్

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రాజమండ్రి పరిశుభ్రమైన పర్యావరణం ప్రతి మనిషి హక్కు” – హెచ్‌ఆర్‌పీఏసీఐ* రాజ మహేంద్ర వరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని “హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ & అవేర్నెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా” ఆధ్వర్యంలో నేడు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. “పరిశుభ్రమైన పర్యావరణం ప్రతి మనిషి హక్కు” అనే సందేశంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు శ్రీ సత్య గుమ్మాపు మరియు సభ్యులు మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ కాలుష్యం వల్ల మానవ ఆరోగ్యం, జీవ వైవిధ్యం, భవిష్యత్ తరాలపై పడే ప్రభావాలను వివరించి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తగరం సురేష్ బాబు ఉచితంగా మొక్కలు అందచేయడం జరిగింది. సంస్థ ఆధ్వర్యంలో సత్య గుమ్మపు డాక్టార్ కే ఎం జగదీష్ మొక్కని అందచేసి స్థానిక బాబా నగర్ లో మొక్కని నాటి దాని భాద్యత, సంరక్షణ ని చూడాలని జగదీష్ తొ ప్రతిజ్ఞ చేయంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్య గుమ్మాపు, డాక్టర్ కె ఎం జగదీష్, బిందు చౌదరి, కొమ్మిరెడ్డి ప్రభావతి, పిచ్చుక మహేష్, పగడాల కిషోర్, గొల్లవెల్లి శ్రీనివాస్, గుంటూరు రమణ, జొన్నకూటి వర్ధన్ కుమార్, ఎరువ మీనాక్షి తదితరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో చైతన్యం తీసుకువస్తాయని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. End

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి రాజమండ్రి
పరిశుభ్రమైన పర్యావరణం ప్రతి మనిషి హక్కు” – హెచ్‌ఆర్‌పీఏసీఐ*
రాజ మహేంద్ర వరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని “హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ & అవేర్నెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా” ఆధ్వర్యంలో నేడు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

“పరిశుభ్రమైన పర్యావరణం ప్రతి మనిషి హక్కు” అనే సందేశంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు శ్రీ సత్య గుమ్మాపు మరియు సభ్యులు మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ కాలుష్యం వల్ల మానవ ఆరోగ్యం, జీవ వైవిధ్యం, భవిష్యత్ తరాలపై పడే ప్రభావాలను వివరించి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తగరం సురేష్ బాబు ఉచితంగా మొక్కలు అందచేయడం జరిగింది.
సంస్థ ఆధ్వర్యంలో సత్య గుమ్మపు డాక్టార్ కే ఎం జగదీష్ మొక్కని అందచేసి
స్థానిక బాబా నగర్ లో మొక్కని నాటి దాని భాద్యత, సంరక్షణ ని చూడాలని జగదీష్ తొ ప్రతిజ్ఞ చేయంచడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సత్య గుమ్మాపు, డాక్టర్ కె ఎం జగదీష్, బిందు చౌదరి, కొమ్మిరెడ్డి ప్రభావతి, పిచ్చుక మహేష్, పగడాల కిషోర్, గొల్లవెల్లి శ్రీనివాస్, గుంటూరు రమణ, జొన్నకూటి వర్ధన్ కుమార్, ఎరువ మీనాక్షి తదితరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలిపారు.

పర్యావరణాన్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో చైతన్యం తీసుకువస్తాయని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.