Friday, 5 June 2026
  • Home  
  • అన్నదేవరపేటలో ఘనంగా పర్యావరణ దినోత్సవం ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు సుస్థిర భవిష్యత్తు : సోము వీర్రాజు
- తూర్పు గోదావరి

అన్నదేవరపేటలో ఘనంగా పర్యావరణ దినోత్సవం ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు సుస్థిర భవిష్యత్తు : సోము వీర్రాజు

తాళ్లపూడి, జూన్ 5 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో గురువారం మొక్కల నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై మొక్కలు నాటారు. టీడీపీ యువ నాయకులు అల్లూరి విక్రమాదిత్య, స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలతో కలిసి గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలను నాటిన సోము వీర్రాజు అనంతరం మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ యువ నాయకులు అల్లూరి విక్రమాదిత్య మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. నాటిన ప్రతి మొక్కను దత్తత తీసుకుని వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు. “ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. భావితరాలకు అందించగలిగే అత్యంత విలువైన సంపద పచ్చని పర్యావరణమే” అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వర్షపాతం క్రమంగా తగ్గిపోతోందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటా కనీసం ఒక మొక్కను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పైడిమెట్ట ఎత్తిపోతల పథకం అధ్యక్షులు ముళ్ళపూడి శ్రీరామచంద్రమూర్తి, తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ, అన్నదేవరపేట జనసేన నాయకులు చెవ్వూరి బంగారు రాజు, రాము, బీజేపీ నాయకులు ఎలుగుబంటి బాలకృష్ణ, పసుపులేటి దత్తాత్రేయులు, స్థానిక నాయకులు, జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

తాళ్లపూడి, జూన్ 5 (పున్నమి ప్రతినిధి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో గురువారం మొక్కల నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై మొక్కలు నాటారు.
టీడీపీ యువ నాయకులు అల్లూరి విక్రమాదిత్య, స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలతో కలిసి గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలను నాటిన సోము వీర్రాజు అనంతరం మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
టీడీపీ యువ నాయకులు అల్లూరి విక్రమాదిత్య మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే విస్తృత స్థాయిలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. నాటిన ప్రతి మొక్కను దత్తత తీసుకుని వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు.
“ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. భావితరాలకు అందించగలిగే అత్యంత విలువైన సంపద పచ్చని పర్యావరణమే” అని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వర్షపాతం క్రమంగా తగ్గిపోతోందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటా కనీసం ఒక మొక్కను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పైడిమెట్ట ఎత్తిపోతల పథకం అధ్యక్షులు ముళ్ళపూడి శ్రీరామచంద్రమూర్తి, తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షులు ఇండుగుల రామకృష్ణ, అన్నదేవరపేట జనసేన నాయకులు చెవ్వూరి బంగారు రాజు, రాము, బీజేపీ నాయకులు ఎలుగుబంటి బాలకృష్ణ, పసుపులేటి దత్తాత్రేయులు, స్థానిక నాయకులు, జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం ముగింపులో పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.