బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగుయ్య
వెల్దండ మే 05 ( ) :
వెల్దండ మండలం లోని చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన సిర్సనగండ్ల చెన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మృతురాలి కి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం కింద 5000 రూపాయలను అందజేశారు. కుటుంబ సభ్యులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోపిరెడ్డి రాఘవరెడ్డి, మాజీ ఎంపీటీసీ చలిచీమల నిరంజన్, మాజీ వార్డు సభ్యులు తాండ్ర శేఖర్,బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొమ్ము నాగయ్య,బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జంగిలి రవికుమార్, జంగిలి ప్రవీణ్, కర్నేకంటి వెంకటయ్య, మావిళ్ళ గణేష్, ఈదులపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

