ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే మూడు రోజుల ఆలస్యంగా కేరళలో ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా మరియు మహారాష్ట్ర ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశం ఆలస్యం