Tuesday, 2 June 2026
  • Home  
  • *గంగమ్మ జాతర్లకు వెంకన్న సారె సమర్పణ*
- తిరుపతి

*గంగమ్మ జాతర్లకు వెంకన్న సారె సమర్పణ*

పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్ తిరుపతి రూరల్‌ మండలం పేరూరు పంచాయతీ హరిపురం కాలనీ, చెంచువారి కాలనీలలో జరుగుతున్న గంగమ్మ జాతర్లకు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, చంద్రగిరి నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డిమోహిత్‌రెడ్డి పట్టువస్త్రాలు అందజేశారు. ముందుగా హరిపురం కాలనీలోని నడివీధి గంగమ్మకు సారెను అందజేసి పూజలు చేశారు. అనంతరం చెంచువారి కాలనీలో అమ్మవారికి సారెను అందించారు. వెంకన్న ఆలయం నుంచి వచ్చిన సారెకు గ్రామపెద్దలు, జాతర నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాదవరెడ్డి, మాజీ ఎంపీపీ మూలం చంద్ర మోహన్ రెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, మండల పార్టీ అధ్యక్షులు మునీశ్వర రెడ్డి, పేరూరు మాజీ సర్పంచ్‌ దామినేటి కేశవులు, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి భానుకుమార్ రెడ్డిలతో పాటు స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు వున్నారు.

పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్

తిరుపతి రూరల్‌ మండలం పేరూరు పంచాయతీ హరిపురం కాలనీ, చెంచువారి కాలనీలలో జరుగుతున్న గంగమ్మ జాతర్లకు తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, చంద్రగిరి నియోజక వర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డిమోహిత్‌రెడ్డి పట్టువస్త్రాలు అందజేశారు. ముందుగా హరిపురం కాలనీలోని నడివీధి గంగమ్మకు సారెను అందజేసి పూజలు చేశారు. అనంతరం చెంచువారి కాలనీలో అమ్మవారికి సారెను అందించారు. వెంకన్న ఆలయం నుంచి వచ్చిన సారెకు గ్రామపెద్దలు, జాతర నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాదవరెడ్డి, మాజీ ఎంపీపీ మూలం చంద్ర మోహన్ రెడ్డి, జడ్పీటీసీ రత్నమ్మ, మండల పార్టీ అధ్యక్షులు మునీశ్వర రెడ్డి, పేరూరు మాజీ సర్పంచ్‌ దామినేటి కేశవులు, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి భానుకుమార్ రెడ్డిలతో పాటు స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు వున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.