శ్రీ కాళహస్తి, జూన్ 01, (పున్నమి న్యూస్) : నిరుద్యోగ యువతపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాసారపు సుబ్బయ్య విమర్శించారు. కష్టపడి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించిన యువతీ యువకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్ మాట్లాడటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను నిరాశపరిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామక ప్రక్రియలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ ద్వారా భారీ స్థాయిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా, దానిపై అనవసర విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని సుబ్బయ్య స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆశయాలను రాజకీయ లాభాల కోసం వాడుకోవాలనే ప్రయత్నాలను యువత గమనిస్తోందని, ప్రజలు తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఖండనీయం-మాసారపు సుబ్బయ్య