స్టానిక చిలకలూరిపేట రోడ్డులో గల అమ్మనాన్నల ప్రేమాలయం వృద్ధులఆశ్రమంలో పల్నాడు జిల్లా & టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులు Md.ఫారూఖ్ బాబు ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చంట్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయకుమార్ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి అక్కడి వృద్దులకు మరియు అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పట్టణ అధ్యక్షులు ఫారూఖ్ బాబు మాట్లాడుతూ మా హీరో కృష్ణ గారు స్వర్గస్తూలై సుమారు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఆయన మీద అభిమానం మాత్రం మా మనస్సులో చిరస్టాయిగా నిలిచి ఉంటుందన్నారు.అలాగే ఆయన జ్ఞాపకo గా మన పట్టణంలో కూడ ఒక విగ్రహాన్ని వీలయినంత తొందరగానే ఏర్పాటు చేయాలను కుంటున్నట్లు తెలియజేశారు.మన పట్టణంలో కూడా కృష్ణ గారి సీనియర్ అభిమానులు ఆర్థికంగా స్థిరపడిన వారు చాలామంది ఉన్నారని కనీసం ! కొందరు సహకరించిన మనం మన సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్నీ ఏర్పాటు చేసుకోవటం పెద్ద పనేమీ కాదన్నారు.
నిర్వహించిన కార్యక్రమంలో సినీయర్ అభిమానులు పత్తికొండ వెంకటరావు,బి.కొండలరావు, పద్మాలయవేణు,లింగంగుంట్ల రాములు, షేక్.నబీబాజీ,ఎన్.గోపికృష్ణ , ఫోటోగ్రాఫర్ చిన్నికృష్ణ ,మన్నేపల్లిశ్రీనివాసరావు ,ఎన్.జయకృష్ణ,షేక్.మీరావలి,డప్పుచంద్ర శేఖర్,కుక్కల పౌలు, సాగర్ కె.రమేష్ , ప్రిన్స్ బాషా, బాలస్వామి మరియు ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.




