Sunday, 31 May 2026
  • Home  
  • జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్
- News

జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారం అభివృద్ధికి కొత్త ఇంజిన్‌గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ కేవలం పరిపాలనా విభాగం కాదు.. ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే అభివృద్ధి వేదిక రైల్వే ఉద్యోగులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ఉత్తరాంధ్ర ప్రతినిధి మే 31 యువతరం న్యూస్ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన అత్యంత కీలక హామీలలో ఒకటైన విశాఖ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల సాకారం కావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.ప్రస్తుతానికి విశాఖపట్నం సిరిపురం డెక్ లో తాత్కాలిక భవనం నందు కార్యాచరణ మొదలుకాబోతుందని జోన్ కొరకు ఇప్పటికే 3,532 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో రైల్వే జోన్ కార్యాలయ సముదాయం దాదాపు రూ.15.50 కోట్ల వ్యయంతో నిర్మించబోయే భవనం ద్వారా పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని తెలిపారు.విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపనుందని అన్నారు.ప్రస్తుతం వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన రైల్వే పరిపాలన ఇకపై విశాఖ కేంద్రంగా మరింత సమర్థవంతంగా కొనసాగనుందని తెలిపారు. రైల్వే పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్త రైల్వే ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాల కల్పనకు విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయని ఎంపీ పేర్కొన్నారు.విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధికి ఈ జోన్ కీలక మలుపు కానుందని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం కేంద్రంతో నిరంతర సమన్వయం కొనసాగించిందని తెలియజేశారు.డబుల్ ఇంజిన్ సర్కార్ చిత్తశుద్ధి,కృషి ఫలితంగానే విశాఖ రైల్వే జోన్ కార్యాచరణ దశకు చేరుకుందని అన్నారు.రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కేంద్ర రైల్వే శాఖతో, ముఖ్యంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమన్వయం చేసుకోవడం తో పాటుగా నిరంతరం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతికి కృషి చేస్తున్నామన్నారు.విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు శక్తివంతమైన ఇంజిన్‌గా మారబోతుందని ఈ సందర్బంగా ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.విశాఖ రైల్వే జోన్ అనేది కేవలం ఒక పరిపాలనా కార్యాలయం కాదు.. ఉత్తరాంధ్ర భవిష్యత్తును తీర్చిదిద్దే అభివృద్ధి వేదిక. ప్రాంతీయ ఆకాంక్షలకు, ఆర్థిక ప్రగతికి, యువత ఉపాధి అవకాశాలకు ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది అని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారం

అభివృద్ధికి కొత్త ఇంజిన్‌గా దక్షిణ కోస్తా రైల్వే జోన్

విశాఖ రైల్వే జోన్ కేవలం పరిపాలనా విభాగం కాదు.. ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే అభివృద్ధి వేదిక

రైల్వే ఉద్యోగులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్

ఉత్తరాంధ్ర ప్రతినిధి మే 31
యువతరం న్యూస్

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన అత్యంత కీలక హామీలలో ఒకటైన విశాఖ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కల సాకారం కావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు.ప్రస్తుతానికి విశాఖపట్నం సిరిపురం డెక్ లో తాత్కాలిక భవనం నందు కార్యాచరణ మొదలుకాబోతుందని జోన్ కొరకు ఇప్పటికే 3,532 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో రైల్వే జోన్ కార్యాలయ సముదాయం దాదాపు రూ.15.50 కోట్ల వ్యయంతో నిర్మించబోయే భవనం ద్వారా పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని తెలిపారు.విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపనుందని అన్నారు.ప్రస్తుతం వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన రైల్వే పరిపాలన ఇకపై విశాఖ కేంద్రంగా మరింత సమర్థవంతంగా కొనసాగనుందని తెలిపారు. రైల్వే పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.

రైల్వే జోన్ ఏర్పాటుతో కొత్త రైల్వే ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, సరుకు రవాణా సామర్థ్యాల పెంపు, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాల కల్పనకు విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయని ఎంపీ పేర్కొన్నారు.విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధికి ఈ జోన్ కీలక మలుపు కానుందని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం కేంద్రంతో నిరంతర సమన్వయం కొనసాగించిందని తెలియజేశారు.డబుల్ ఇంజిన్ సర్కార్ చిత్తశుద్ధి,కృషి ఫలితంగానే విశాఖ రైల్వే జోన్ కార్యాచరణ దశకు చేరుకుందని అన్నారు.రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కేంద్ర రైల్వే శాఖతో, ముఖ్యంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమన్వయం చేసుకోవడం తో పాటుగా నిరంతరం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతికి కృషి చేస్తున్నామన్నారు.విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు శక్తివంతమైన ఇంజిన్‌గా మారబోతుందని ఈ సందర్బంగా ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.విశాఖ రైల్వే జోన్ అనేది కేవలం ఒక పరిపాలనా కార్యాలయం కాదు.. ఉత్తరాంధ్ర భవిష్యత్తును తీర్చిదిద్దే అభివృద్ధి వేదిక. ప్రాంతీయ ఆకాంక్షలకు, ఆర్థిక ప్రగతికి, యువత ఉపాధి అవకాశాలకు ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.