భువనగిరి పట్టణ బిఆర్ఎస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి కౌన్సిలర్లు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం
భువనగిరి పట్టణం లో నిత్యం ప్రజలు కుక్కలు మరియు కోతుల బారినపడి గాయాలు ఈ మధ్యకాలంలో కావడం జరుగుతుంది తారకరామ నగర్ లో ఒక బాబు కన్ను కోల్పోవడం జరిగింది మరియు నిన్న హౌసింగ్ బోర్డు లో చిన్న బాబు తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది అయినా కూడా మున్సిపల్ పాలకవర్గం మరియు అధికారులు మొద్దు నిద్ర నటిస్తూ ఎమర్జెన్సీ కానీ వాటికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానీ నిజంగా అత్యవసరం ఉన్న వాటికి చర్చించక పోవడం చాలా బాధాకరం విషయం ఈ మధ్యలో సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కల మీద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మన భువనగిరి పట్టణంలోని 35వార్డు లలో కుక్కలను మరియు కోతులను వెంటనే పట్టాలని లేనియెడల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది మరియు భువనగిరి పట్టణంలో మెప్మా విభాగంలో భారీ అవినీతి జరిగిందని చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్న మున్సిపల్ కార్యాలయం నుండి ఈరోజు వరకు కూడా ఎంత అవినీతి జరిగిందో పేపర్ ప్రకటన కానీ అవినీతి చేసిన అధికారుల మీద ఆర్పీల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు ప్రజలకు తెలియజేయలేదు మీరు వెంటనే అవినీతి చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని లేనియెడలో బిఆర్ఎస్ పార్టీ తరఫున రానున్న రోజులలో పోరాటం చేస్తామని తెలియజేయడం జరిగింది.



