ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ-గవర్నెన్స్ వ్యవస్థను విస్తరిస్తున్నారు. భూమి రికార్డులు, ఆదాయ ధృవపత్రాలు, పౌర సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు.
డిజిటల్ సేవల ద్వారా ప్రజలకు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గుతుందని అధికారులు తెలిపారు.


