ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించేందుకు విశాఖపట్నంలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నారు. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు పాల్గొననున్నాయి.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


