ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కాలనీలో లక్షల రూపాయల వ్యయంతో తాగునీటి పైపులైన్లు వేసినా, కుళాయిలు బిగించకపోవడంతో కాలనీవాసులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నెలల తరబడి నిర్లక్ష్యం చేయడంతో, ఈ వేసవిలో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న మురుగు కాలువ పక్కన, తీవ్ర దుర్వాసన మధ్య క్యాలన్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి కుళాయిలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

పైపులైన్లు వేశారు.. కుళాయిలు బిగించడం మరిచారు