విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలకు చెందిన రూ. వందల కోట్ల విలువైన భూములు అక్రమార్కుల పరమయ్యాయి. పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు రికవరీ చేయడంలో విఫలమవుతున్నారు.
దుర్గగుడి భూములు (రూ. 200 కోట్లకు పైగా): లోటస్ ల్యాండ్‌మార్క్ ప్రాంతంలోని సర్వే నంబర్ 112లో గల దుర్గగుడికి చెందిన 11.54 ఎకరాల భూమి కబ్జాకు గురైంది.
పట్టాభిరామస్వామి ఆలయ భూమి (రూ. 25 కోట్లు): మల్లికార్జునపేట ఆలయానికి చెందిన 1.96 ఎకరాల భూమిని రెవెన్యూ సిబ్బంది సహకారంతో అడంగల్‌లో పేర్లు మార్చి ఎనిమిది మంది పంచుకున్నారు.
కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం: గొల్లపూడిలోని ఈ ఆలయ భూమిని జాతీయ రహదారుల సంస్థ సేకరించగా వచ్చిన పరిహారం రూ. 60 లక్షలను కాజేశారు. దీనిపై 2016లో కేసు నమోదైనా రూపాయి కూడా రికవరీ కాలేదు.


