Tuesday, 26 May 2026
  • Home  
  • నిరాధార వార్తలు రాసి చెడ్డ పేరు తేకండి
- ఆంధ్రప్రదేశ్

నిరాధార వార్తలు రాసి చెడ్డ పేరు తేకండి

ప్రభుత్వ భూముల కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోండి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు విశాఖపట్నం మే27(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్):పెందుర్తి నియోజకవర్గంలో భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించే ప్రశ్నే లేదని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. భూకబ్జా లలో తన పార్టీ, కుటుంబీకుల ప్రమేయం ఉంటే సహించబోనని పునరుద్ఘాటించారు.పెందుర్తి నియోజక వర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో మంగళ వారం పెందుర్తి మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, పెందుర్తి సిఐ కెవి సతీష్ కుమార్, జీవీఎంసీ జోన్ 8 ఏసీపీ రామ లింగారెడ్డి తో కలిసి విలేకర్ల నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, ఇటీవల మీడియాలో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై వస్తున్న కథనాలపై తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. నిరాధార వార్తలు ప్రచురించి వ్యక్తిగతంగా, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ఏదైనా ఆరోపణకు సంబంధించిన వార్త రాసే ముందు తన వివరణ గాని, సంబంధిత అధికారుల వివరణ గాని తీసుకుని వార్తలు ప్రచురించాలని కోరారు. ముఖ్యంగా భూ అక్రమణలలో కూటమి నాయకులు ప్రమేయం అంటూ వార్తలు రాసే ముందు కచ్చితంగా తన వివరణ తీసు కోవాల్సిందేనని స్పష్టం చేశారు. కొందరు విలేకరులు తొందరపాటుతో రాసిన వార్తలు, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా తనకు భారీ ఎత్తున నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన మొదటి రోజు నుండి ప్రభుత్వ భూముల ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోనంటూ స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఇంకా కొందరు విలేకరులు నిరాధార ఆరోపణలు చేస్తూ జనాల్లో అయోమయం సృష్టి స్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు.అలాగే మీడియాలో వస్తున్న కథనాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి తక్షణం చర్యలు చేపట్టాలని ఎమ్మార్వోకు సూచించారు. అలాగే వచ్చే శనివారం మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి భూ ఆక్రమణలు, చెరువుల కబ్జా తదితర అంశాలను మీడియా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. జీవీఎంసీ 97వ వార్డు కార్మిక నగర్ చెరువు కబ్జాకాండపై అతి త్వరలో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే టీచర్స్ లేఅవుట్ సమీపంలో ఎన్నారై భూమి వివాదంపై రెవిన్యూ అధికారులు విచారిస్తారని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోండి

జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు


విశాఖపట్నం మే27(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్):
పెందుర్తి నియోజకవర్గంలో భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించే ప్రశ్నే లేదని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. భూకబ్జా లలో తన పార్టీ, కుటుంబీకుల ప్రమేయం ఉంటే సహించబోనని పునరుద్ఘాటించారు.
పెందుర్తి నియోజక వర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో మంగళ వారం పెందుర్తి మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, పెందుర్తి సిఐ కెవి సతీష్ కుమార్, జీవీఎంసీ జోన్ 8 ఏసీపీ రామ లింగారెడ్డి తో కలిసి విలేకర్ల నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, ఇటీవల మీడియాలో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై వస్తున్న కథనాలపై తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. నిరాధార వార్తలు ప్రచురించి వ్యక్తిగతంగా, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ఏదైనా ఆరోపణకు సంబంధించిన వార్త రాసే ముందు తన వివరణ గాని, సంబంధిత అధికారుల వివరణ గాని తీసుకుని వార్తలు ప్రచురించాలని కోరారు. ముఖ్యంగా భూ అక్రమణలలో కూటమి నాయకులు ప్రమేయం అంటూ వార్తలు రాసే ముందు కచ్చితంగా తన వివరణ తీసు కోవాల్సిందేనని స్పష్టం చేశారు. కొందరు విలేకరులు తొందరపాటుతో రాసిన వార్తలు, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా తనకు భారీ ఎత్తున నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన మొదటి రోజు నుండి ప్రభుత్వ భూముల ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోనంటూ స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఇంకా కొందరు విలేకరులు నిరాధార ఆరోపణలు చేస్తూ జనాల్లో అయోమయం సృష్టి స్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు.
అలాగే మీడియాలో వస్తున్న కథనాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి తక్షణం చర్యలు చేపట్టాలని ఎమ్మార్వోకు సూచించారు. అలాగే వచ్చే శనివారం మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి భూ ఆక్రమణలు, చెరువుల కబ్జా తదితర అంశాలను మీడియా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. జీవీఎంసీ 97వ వార్డు కార్మిక నగర్ చెరువు కబ్జాకాండపై అతి త్వరలో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే టీచర్స్ లేఅవుట్ సమీపంలో ఎన్నారై భూమి వివాదంపై రెవిన్యూ అధికారులు విచారిస్తారని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.