Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలి

వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలి

ప్రభుత్వం పంటల సాగు ఆధారంగా సమీప ప్రాంతంలో స్టోరేజ్ కేంద్రాలు నిర్మాణం చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి
గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం:- ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయం వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగు ప్రణాళిక ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు.
గురువారం ఖమ్మం సుందరయ్య భవన్ లో బండి రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం లో పంటల సాగు ప్రణాళిక లేకుండా పోయింది అని అన్నారు. రైతులు తమకు దోచిన పద్దతి లో విత్తన సమయం లో ఉన్న డిమాండ్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వం భూమి సారం, నీటి పారుదల సౌకర్యం, వాతావరణ పరిస్థితులు, రైతులు పెట్టుబడి, స్థానిక అవసరాలు, ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు ఉన్న అవకాశాలు, ఎరువులు అందుబాటులో ఉన్న స్థితి, ధరలు మద్దింపు చేసి ప్రతి జిల్లా ను రెండు మూడు విభాగాలుగా చేసి భిన్న పంటల సాగు ప్రణాళిక ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్లో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అన్నారు, రైస్ మిల్లులు, లారీ కాంట్రాక్టులు, గోదాములు సిబ్బంది దయపై ఆధారపడి రైతులు నుంచి మొక్కజొన్న,వరి ధాన్యం కొనుగోలు జరుగుతుంది అని అన్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పెంపు చాలా స్వల్ప పెరుగు దల ఉంటే ఎరువులు పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి అని వ్యవసాయ రంగం పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు, మద్దతు ధర పెంపు, చట్టబద్ధమైన మద్దతు ధర కోరుతూ జిల్లాలో నిరసన కార్యక్రమాల్లో రైతులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్, ఎస్ కె మీరా దుగ్గి కృష్ణ, ఇంజం నాగభూషణం, బొంతు సమత, నల్లమోతు మోహన్ రావు,ప్రతాప్ నేని వెంకటేశ్వరరావు, తోట వెంకటరెడ్డి, కందుల భాస్కర్ రావు, మల్లెంపాటి రామారావు, గుండ్ల వెంకటేశ్వరరావు,వజ్జా రామారావు, తోటకూర వెంకట నరసయ్య, చిలకల వెంకటేశ్వర్లు, కొమ్మినేని నాగేశ్వరరావు, బిగ రమేష్, మాదాల వెంకటేశ్వరరావు, కుసుపూడి మధు, ఐనాల రామలింగేశ్వరరావు,వలూరు శ్రీనివాసరావు మడుపల్లి కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు

వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *