Thursday, 14 May 2026
  • Home  
  • త్రయోదశి సందర్భంగా నందీశ్వరునికి విశేష పూజలు
- తిరుపతి

త్రయోదశి సందర్భంగా నందీశ్వరునికి విశేష పూజలు

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోషకాల పూజలు బుధవారం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ప్రదోష వేళలో ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారితో పాటు నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, విభూతి, పన్నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో షోడశోపచార పూజలు నిర్వహించి స్వామివారిని బిల్వపత్రాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అలాగే నందీశ్వరుడికి విశేష అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.