Monday, 11 May 2026
  • Home  
  • అక్కుర్తిలో అభయాంజనేయ స్వామి కల్యాణోత్సవం నేడు
- తిరుపతి

అక్కుర్తిలో అభయాంజనేయ స్వామి కల్యాణోత్సవం నేడు

శ్రీకాళహస్తి, మే 11 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మే 12 మంగళవారం అభయాంజనేయ స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త జూలుగంటి మురళీమోహన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకం, అలంకరణ, అర్చన, వడమాల సేవలను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నాట్య కళాబృందం ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు, కోలాటాలు నిర్వహించనుండగా, అనంతరం సువర్చల సమేత శ్రీ అభయాంజనేయ స్వామివారి కల్యాణోత్సవం భక్తి వైభవాల మధ్య జరగనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ కోరికలు నెరవేర్చుకోవాలని ఆలయ నిర్వాహకులు కోరారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదాన వితరణ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.