Monday, 4 May 2026
  • Home  
  • అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మే 04 (పున్నమి న్యూస్): ఏర్పేడుమండలంలోని మెర్లపాక గ్రామంలో అర్హులైన ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయిస్తామని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఏర్పేడు మండల పరిధిలోని మెర్లపాక గ్రామ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం స్థానిక ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఇళ్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, ఇళ్ల మంజూరులో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మెర్లపాక గ్రామంలో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారుల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని, ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చొరవ పట్ల మెర్లపాక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.