ఖమ్మం, ఏప్రిల్
(పున్నమి జిల్లా ఇంచార్జి)
తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపో లలో
అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు బస్ డిపోల ఎదుట కూర్చొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా కోసం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపినా, ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందనే అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది.



