జిల్లాలో నేరాల నియంత్రణ కోసం పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ నిఘాను విస్తృతంగా అమలు చేస్తున్నారు. జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పట్టణం, శివారు ప్రాంతాలు మరియు క్రైమ్ ప్రోన్ ఏరియాలలో రాత్రిపూట డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతోంది. మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, దొంగతనాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.



