శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( బాలల హక్కుల రక్షణలో విశేష కృషి చేస్తున్న ప్రగతి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి. రమణకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో “Pathways to Possibilities” థీమ్‌తో CRY America నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు గెస్ట్ స్పీకర్‌గా ఆయన ఆహ్వానం అందుకున్నారు. ఏప్రిల్ 22న అమెరికా పర్యటనకు బయలుదేరనున్న రమణ, మే 3 వరకు వివిధ నగరాల్లో జరిగే సదస్సుల్లో ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ న్యూయార్క్, హ్యూస్టన్, సియాటిల్, బే ఏరియా, సాన్ డియాగో వంటి ఐదు ప్రధాన నగరాల్లో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేదికలపై ప్రముఖ నటుడు విక్రాంత్ మెస్సేయ్ సహా పలువురు అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి రమణ పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కుల అంశానికి ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సులు సాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రగతి సంస్థ చేస్తున్న పోరాటాన్ని రమణ ఈ సందర్భంగా వివరించనున్నారు. ముఖ్యంగా విద్యా ప్రాముఖ్యత, బాలల రక్షణ, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలన, అంగన్వాడీలు, పాఠశాలల బలోపేతం వంటి కీలక అంశాలపై తన క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకోనున్నారు. వెనుకబడిన వర్గాల పిల్లల హక్కులు, గౌరవప్రదమైన జీవనంపై అంతర్జాతీయ మద్దతు సమీకరించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా కె.వి. రమణ మాట్లాడుతూ.. ఈ సువర్ణావకాశం దక్కడం ప్రగతి సంస్థ సిబ్బంది నిరంతర కృషికి దక్కిన ఫలితమని హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 24న న్యూయార్క్‌లో ప్రారంభం కానున్న మొదటి సదస్సుతో ఆయన పర్యటన మొదలుకానుంది.

CRY గెస్ట్ స్పీకర్‌గా కె.వి. రమణ-అంతర్జాతీయ వేదికపై బాలల హక్కుల నినాదం