ఇంటర్ ఉత్తీర్ణతలో ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు రావడం వల్ల విద్యార్థులు నిరాశ చెందొద్దని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలు జీవితంలో ఒక భాగమే కానీ భవిష్యత్తుకు ముగింపు కాదని పేర్కొన్నారు. మార్క్‌షీట్‌లో పడిన కొన్ని సంఖ్యలు మన ప్రతిభను నిర్ణయించవని తెలిపారు. ఓటమిని పాఠంగా తీసుకుని మళ్లీ ప్రయత్నిస్తే విజయాలు సాధ్యమని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై ఒత్తిడి చేయకుండా ధైర్యం చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ప్రత్యేక ప్రతిభ ఉందని, ఒక పరీక్ష ఫలితంతో జీవితాన్ని అంచనా వేయరాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. సహనం, పట్టుదలతో ముందుకు సాగితే మంచి అవకాశాలు ఎదురవుతాయని తెలిపారు

పరీక్ష ఫలితం స్టేజ్ దాటడానికి మాత్రమే… జీవితం కాదు!