తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఏప్రిల్ 12 (పున్నమి ప్రతినిధి):
తాళ్లపూడి మండలంలోని రాగోలపల్లి గ్రామానికి చెందిన కస్సే శ్రీను ఫిట్స్, తల గాయాలు, భుజం నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్య ఖర్చులు మరియు కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించింది.
సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000, అలాగే కాలినేని ప్రదీప్ వ్యక్తిగతంగా రూ.1,000 అందించడంతో మొత్తం రూ.7,000ను బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటి బొట్టును తుడవడమే మానవత ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సహాయ కార్యక్రమాలకు సంస్థ పెద్దపీట వేస్తోందని చెప్పారు.
తలారి రామ్మోహన్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తప్పకుండా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడం సంస్థ ధ్యేయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, గెడ్డం సాయిబాబా, తలారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఆదుకున్న మానవత – బాధితుడికి రూ.7 వేల ఆర్థిక సహాయం
తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఏప్రిల్ 12 (పున్నమి ప్రతినిధి): తాళ్లపూడి మండలంలోని రాగోలపల్లి గ్రామానికి చెందిన కస్సే శ్రీను ఫిట్స్, తల గాయాలు, భుజం నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, వైద్య ఖర్చులు మరియు కుటుంబ పోషణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించింది. సంస్థ ఆధ్వర్యంలో రూ.6,000, అలాగే కాలినేని ప్రదీప్ వ్యక్తిగతంగా రూ.1,000 అందించడంతో మొత్తం రూ.7,000ను బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారి కన్నీటి బొట్టును తుడవడమే మానవత ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సహాయ కార్యక్రమాలకు సంస్థ పెద్దపీట వేస్తోందని చెప్పారు. తలారి రామ్మోహన్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తప్పకుండా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవులకు సేవ చేయడం సంస్థ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, గెడ్డం సాయిబాబా, తలారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

