ముస్తాబాద్ ఏప్రిల్ 11 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండలం చికోడు గ్రామంలో
మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు , నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భరతమాత ముద్దుబిడ్డగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన ఫూలే గారు సామాజిక సంస్కరణలకు ప్రేరణగా నిలిచారని కొనియాడారు. మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శిగా, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పించేందుకు జీవితమంతా పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు.
ఫూలే గారి సేవలు సమాజ ప్రగతికి నిత్యం స్పూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు ., ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా, ఐక్యతకు ప్రతీకగా కన్నుల పండుగగా జరిగింది.


