పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినిల్ జన్మదిన వేడుకలు రామచంద్రపురం మండలంలో ఘనంగా జరిగాయి. 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి పులివర్తి వినీల్ చేసిన కృషి అమోఘమని తిరుమలరెడ్డి అన్నారు.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ జన్మదిన వేడుకలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేకను కట్ చేసి పలుగురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా తిరుమలరెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే పులివర్తి నాని విజయానికి తనయుడు చేసిన కృషి అమోఘం అన్నాడు. ఇప్పుడు కూడా చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల సింగల్ విండో అధ్యక్షుడు జనార్దన్ చౌదరి, కోర హరిప్రసాద్ నాయుడు, సుబ్రహ్మణ్యం యాదవ్, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


