Date 14-3-2026
ఉదయగిరి: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉదయగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజగవర్గం ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు గారు హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉదయగిరి మండల అధ్యక్షులు సురేంద్రారెడ్డి, రవీంద్ర మరియు దుత్తలూరు మండల అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేడుకలలో భాగంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి, భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో మరింత బలపరచాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని పార్టీపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.



