CWFI, CITU రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మార్చి 13న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టనున్నట్లు CWFI రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి తెలిపారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని, CSC హెల్త్ సెంటర్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు పెన్షన్, భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల నిర్మాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మార్చి 13న ఉదయం 10 గంటలకు జరిగే ఆందోళన కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గీస బిక్షపతి తో పాటు గుర్జాల శ్రీధర్ సంఘం దేవయ్య కొడం రమణ మరియు విమలక్క పద్మ మరియు జిల్లా కార్మిక నాయకులు పిలుపునిచ్చారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి మార్చి 13న కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన
CWFI, CITU రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మార్చి 13న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టనున్నట్లు CWFI రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని, CSC హెల్త్ సెంటర్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు పెన్షన్, భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల నిర్మాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 13న ఉదయం 10 గంటలకు జరిగే ఆందోళన కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గీస బిక్షపతి తో పాటు గుర్జాల శ్రీధర్ సంఘం దేవయ్య కొడం రమణ మరియు విమలక్క పద్మ మరియు జిల్లా కార్మిక నాయకులు పిలుపునిచ్చారు.

