ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
వెలుగుమట్ల నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాతో పాటు ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదవాడి పక్షాన నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
వెలుగుమట్లలో ఇళ్ల కోల్పోయిన కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.


