Saturday, 28 February 2026
  • Home  
  • విద్యుత్ బారిన పడి రైతు మృతి… కుటుంబంలో తీవ్ర విషాదం
- తిరుపతి

విద్యుత్ బారిన పడి రైతు మృతి… కుటుంబంలో తీవ్ర విషాదం

మండల పరిధిలోని పత్తిగుంట వారి పల్లెకు చెందిన రాఘవ నరసరాజు (59) శనివారం మధ్యాహ్నం విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. తన వ్యవసాయ పొలంలోని నిమ్మ తోటకు నీరు పట్టేందుకు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన ఆయన, లైన్ నుంచి మోటార్‌కు వెళ్లే విద్యుత్ తీగ కిందపడిన విషయాన్ని గమనించకపోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నరసరాజు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి రైతు కుటుంబాన్ని తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మండల పరిధిలోని పత్తిగుంట వారి పల్లెకు చెందిన రాఘవ నరసరాజు (59) శనివారం మధ్యాహ్నం విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. తన వ్యవసాయ పొలంలోని నిమ్మ తోటకు నీరు పట్టేందుకు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన ఆయన, లైన్ నుంచి మోటార్‌కు వెళ్లే విద్యుత్ తీగ కిందపడిన విషయాన్ని గమనించకపోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నరసరాజు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి రైతు కుటుంబాన్ని తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.