నిశితమైన దేశభక్తి, అద్భుతమైన కవిత్వం కారణంగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన, ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి మరియు రాజకీయ నాయకురాలు, మహిళా సాధికారత, విద్య కోసం కృషి చేసిన స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్‌గా చరిత్ర సృష్టించిన భారత కోకిల స్వర్గీయ శ్రీమతి సరోజినీ నాయుడు జన్మదినాన్ని (13 ఫిబ్రవరి 1879) “జాతీయ మహిళా దినోత్సవం” గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా పాఠకుల కోసం ఈ కవిత
*శ్రీ* శ్రీమంతులైన గుణసంపన్నుల పుత్రికగ
*మ* మనసు నిండా దేశభక్తి నింపుకుని
*తి* తిలకం దిద్దబడి ఎదిగిన చైతన్యమాధురి
*స* సంస్కృతి సంస్కార నీలాంబరి
*రో* రోజు మారితే గీత మారదని
*జి* జిజ్ఞాసతో సాహిత్యమే శ్వాసగా
*నీ* నీతి న్యాయం భరతావని ఆశయం అని
*నా* నా కన్నా దేశ సంక్షేమమే ముఖ్యమని
*యు* యుక్తులన్నీ స్వదేశ పాలనకే అని
*డు* ఆర్ డై అనే గాంధేయ మార్గ సన్నిహితురాలై
*భా* భారతావని ముద్దుబిడ్డగ
*ర* రసాత్మక కవిత్వ శౌర్యశిఖామణిగ
*త* తగిన సామాజిక చైతన్య జ్యోతిగ
*కో* కోరుకున్న సమ సమాజ నిర్మాణం కోసం
*కి* కిలకిలరావాల జాతీయ భావాల భాష్యమై
*ల* లయమై మహాత్మునికి ప్రియమై పిలువబడ్డ భారత కోకిల
స్వర్గీయ శ్రీమతి సరోజినీ నాయుడు.


