శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీకాళహస్తి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాజకీయ, సినీ ప్రముఖుల సందడి నెలకొననుంది. ఇందులో భాగంగా గురువారం నాడు అమరావతిలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలుసుకుని బాలకృష్ణకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, స్వామివారి వేడుకలకు విచ్చేయాలని సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రాశస్త్యాన్ని, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సుధీర్ రెడ్డి బాలయ్యకు వివరించారు. తన అభిమాన నాయకుడిని కలవడం సంతోషంగా ఉందని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం భక్తులకు మరింత ఉత్సాహాన్నిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అఖండకు శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాల ఆహ్వానం