Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

భర్త అత్త కోడలు పై ఒత్తిడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భర్త అత్త కోడలు పై ఒత్తిడి

*అందంగా ఉన్నావ్,వ్యభిచారం చేయాలని కట్టుకున్న భర్త అత్త కోడలు పై ఒత్తిడి,డబ్బులు బాగా వస్తాయి అని వేధింపులు*

టార్చర్ ,భరించలేక వివాహిత అంజనా భాయ్ ఆత్మహత్య.కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ పట్టణంలో ఘటన చోటుచేసుకుంది…

Bangalore Karnataka:
అత్తగారింట్లో నరకం అనుభవించలేక
ఈ విషయాలను బయట ఎవరికీ చెప్పుకోలేక, అత్తగారింట్లో నరకం అనుభవించలేక అంజనాబాయి ఫిబ్రవరి 6 వ తేదీన తన భర్త ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది. తన కూతురిని ఈ ముగ్గురే వేధించి చంపేశారని తండ్రి విజయ్ కుమార్ బసవకల్యాణ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యతగా చూసుకోవాల్సిన భర్తే కాల యముడుగా మారి, అన్నీ అవ్వాల్సిన అత్తమామలే వ్యభి చార కూపంలోకి నెట్టితే ఆ ఇల్లాలు తన గొడును ఎవరితో చెప్పుకుంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బసవకళ్యాణ్ పట్టంలో చోటుచేసుకుంది. అంజనాబాయ్ అనే మహిళకు ఇదే నగరానికి చెందిన శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈ జంటకు 11 నెలల పాపజన్మించింది. కొన్నిరోజుల అనంతరం ఆమెను భర్త, అత్తమామలు వ్యభిచారం చేయాలని మానసికంగా భాధపెట్టారు. వాళ్లు చెప్పినట్లు నడుచుకోకుంటే పలు విధాలుగా వేధించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బా ధితురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ శేఖర్ పాటిల్ను అంజనా బాయి 2022లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లు అంతా సవ్యంగానే ఉంది. శేఖర్ పానీ పూరీ వ్యాపారం చేస్తుండేవాడు. రోజూ ఇంటికొచ్చేసరికి రాత్రి 11 నుంచి 12 దాటేది. ఈ విషయంలో భార్యాభర్త మధ్య గొడవలు జరిగాయి.సాయంత్రం త్వరగా వెళ్లేసి రాత్రి 10 గంటల లోపు ఇంటికి రావాలని భర్తను అంజనా బాయి అడిగింది. అందుకు కుదరదని భర్త తెగేసి చెప్పాడు. శేఖర్ అత్త కూడా కోడలిపై ఇదే విషయంలో కస్సుబుస్సులాడింది. భర్త, అత్త కలిసి అప్పటి నుంచి అంజనాను వేధించడం మొదలుపెట్టారు.వ్యభిచారం చేయాలని భర్త, అత్త ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. అందంగా ఉన్నావని.. వ్యభిచారం చేసి బాగా సంపాదించొచ్చని అంజనాను భర్త, అత్త కలిసి వేధించారు. 11 నెలల పాప ఉన్న తల్లిని ఇలా సూటిపోటి మాటలతో వేధించి వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేయడంతో అంజనా బాయి మానసిక వేదనను తట్టుకోలేక పోయింది.క్షణికావేశంలో చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకుంది.

భర్త అత్త కోడలు పై ఒత్తిడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *