Wednesday, 11 February 2026
  • Home  
  • కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకుల ఘాటు నిరసన
- రాజన్న సిరిసిల్ల

కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకుల ఘాటు నిరసన

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి రోజు ముస్తాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో పట్టణ మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోమ్మేట రాజు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేటీఆర్ గారిపై చేసిన అహంకారపూరితమైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక వహించిన గొప్ప నాయకుడని, ఐటీ మంత్రిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిపై అసభ్యంగా మాట్లాడటం తగదని అన్నారు. దయాకర్ దళిత సమాజం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు. అలాగే దళితులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిధులు కోరే విషయంలో ఆయన ఎలాంటి చొరవ చూపలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముక్క మల్లయ్య, యండి. జహంగీర్, సుంచు కృష్ణ, శీలం వెంకటేష్, తలారి గొండయ్య, నర్సయ్య, శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.

ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి

రోజు ముస్తాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో పట్టణ మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోమ్మేట రాజు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేటీఆర్ గారిపై చేసిన అహంకారపూరితమైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక వహించిన గొప్ప నాయకుడని, ఐటీ మంత్రిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిపై అసభ్యంగా మాట్లాడటం తగదని అన్నారు.
దయాకర్ దళిత సమాజం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు. అలాగే దళితులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిధులు కోరే విషయంలో ఆయన ఎలాంటి చొరవ చూపలేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ముక్క మల్లయ్య, యండి. జహంగీర్, సుంచు కృష్ణ, శీలం వెంకటేష్, తలారి గొండయ్య, నర్సయ్య, శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.